సిల్వర్ స్క్రీన్‌పై తొలి సంస్కృత యానిమేటెడ్ చిత్రం, ట్రైలర్ విడుదల

కథేమిటంటే.. ఒక గ్రామం శివార్లలో ‘పుణ్యకోటి’ అనే పేరుగల ఆవు ‘అద్భుత’ అని పిలువబడే పులి కంటపడింది. చంపడానికి వచ్చిన పులితో ఆవు జాలిగా ‘నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. దానికి పాలు తాగించి తిరిగి వస్తాను. నన్ను వెళ్లనివ్వు’ అంటుంది. ఆవులోని నిజాయితీ పట్ల పులికి నమ్మకం కలిగింది ‘సరే, వెళ్లిరా!’ అని పంపిస్తుంది. పులికి తనపై కలిగిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆవు తన బిడ్డకు పాలిచ్చి పులివద్దకు తిరిగి వచ్చి ‘ఇప్పుడు నువ్వు నున్న చంపి నీ ఆకలిని తీర్చుకోవచ్చు’ అంటుంది. పులి ఆ ఆవులోని గొప్ప నిజాయితీని చూచి ఆశ్చర్యపోయి దాని ఎదుట తలవంచి వెనక్కి తిరిగి దూరంగా వెళ్లిపోతుంది.